![సత్యం రాజేష్ మూవీ టెనెంట్ ట్రైలర్ లాంచ్](https://static.v6velugu.com/uploads/2023/12/satyam-rajesh-movie-tenant-trailer-launch-event-held-on-wednesday_bDus2P4WtL.jpg)
ఇటీవల ‘పొలిమేర 2’తో ఆకట్టుకున్న సత్యం రాజేష్.. ‘టెనెంట్’ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మేఘా చౌదరి, భరత్‌కాంత్, చందన, ఎస్తేర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. వై.యుగంధర్ దర్శకుడు. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బుధవారం జరిగింది. దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత సాహు గారపాటి, హీరో సుడిగాలి సుధీర్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘కథతో పాటు ఇందులోని ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరూ సీట్ ఎడ్జ్‌లో కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది’ అన్నాడు. అనుకున్న బడ్టెట్‌లో, తక్కువ వర్కింగ్ డేస్‌లో సినిమాను పూర్తి చేశామని, సత్యం రాజేష్ సపోర్ట్ మర్చిపోలేనని దర్శకుడు చెప్పాడు. తమ సంస్థకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందన్నారు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో టీమ్ అంతా పాల్గొన్నారు.