
పొలిమేర ఫేమ్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ టెనెంట్. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెట్ తో వచ్చిన ఈ సినిమాలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, ఎస్తేర్, ఆడుకలం నరేన్, చందు కీ రోల్స్ చేసిన ఈ సినిమాను కొత్త దర్శకుడు వై యుగంధర్ తెరకెక్కించాడు. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్స్ లో విడుదల అయ్యింది. నిజానికి ఈ సినిమాను ఓటీటీ కోసం తీశారు మేకర్స్. కానీ, ఆ సమయంలో పెద్ద సినిమాలు విడుదలకు లేకపోవడంతో థియేటర్స్ లో విడుదల చేశారు మేకర్స్.
అయితే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం బాగోలేదని ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తాజాగా ఓటీటీలో ప్రత్యేక్షమయ్యింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడన్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఇక టెనెంట్ సినిమా కథ విషయానికి వస్తే.. గౌతమ్, సంధ్య కొత్తగా పెళ్ళైన జంట. అలా ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కొంతకాలానికి ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాడు. సంధ్య విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె ఎందుకు అలా ప్రవర్తితుంది అనే విషయం తెలుసుకునేలోపే బెడ్‌పై శవమై కనిపిస్తుంది సంధ్య. అదే సమయంలో ఆ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంతకు ఎం జరిగింది? సంధ్య ఎలా చనిపోయింది? అపార్ట్మెంట్ పైనుండి దూకిన వ్యక్తి ఎవరు? ఇన్వెస్టిగేషన్ లో బయటకొచ్చిన నిజాలేంటి? అనేది మిగిలిన కథ.