
కరీంనగర్ సిటీ, వెలుగు: మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్ శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి సమక్షంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపదాస్ మున్షీ.. సత్యనారాయణగౌడ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రాష్ట్ర ఓబీసీ సెల్ సమన్వయకర్త శ్రీనివాస్ పాల్గొన్నారు.