మానకొండూరు కాంగ్రెస్​ జెండా ఎగరేస్తాం: కె.సత్యనారాయణ

గన్నేరువరం, వెలుగు: మానకొండూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం గన్నేరువరం మండలం జంగపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారు ప్రజలను మోసం చేస్తోందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధిని మరిచి సంపాదనలో పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలుచేస్తామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉపేందర్, రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అనంతరెడ్డి, వెంకట్, ఆంజనేయులు, శ్రీనివాస్, కనకయ్య, వంశీ కృష్ణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సునీల్, సంపత్‌‌‌‌రెడ్డి, మల్లేశం,  పాల్గొన్నారు. 

అభివృద్ధి చూపించాకే ఓట్లడగాలి

గంగాధర: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ రూ.1800 కోట్ల అభివృద్ధి చూపించాకే ఓట్లడగాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం డిమాండ్​ చేశారు. గంగాధర మండల కేంద్రానికి చెందిన సుమారు 500 మంది గ్రామస్తులు కాంగ్రెస్ నాయకుడు పడాల రాజన్న ఆధ్వర్యంలో మంగళవారం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండిలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ఎమ్మెల్యే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్, లీడర్లు మల్లేశం, గంగన్న, శ్రీనివాస్, భాస్కర్, శ్రీనివాస్​రెడ్డి, వీరేశం, శ్రీనివాస్​రెడ్డి, మహేందర్, నాగేందర్, మల్లేశం, మహేశ్ పాల్గొన్నారు.