గూడూరు, వెలుగు : రాష్ట్రంలోని పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కడే అని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బూత్ కమిటీల సమన్వయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కేసీఆర్ను మూడోసారి సీఎం చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన బంధు, దళితబంధు, మైనార్టీ బంధు అందించిన నేత కేసీఆర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్మెన్ బిందు, భరత్ కుమార్ రెడ్డి, ఖాసీం, లక్ష్మణ్ రావు, వీరన్న, కిషన్, సురెంర్, నర్సింహా నాయక్ పాల్గొన్నారు.