మహబూబాబాద్, వెలుగు : బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్ష నేతలు పరేషన్అవుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్లో ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు పాత గతే పడుతుందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు డబ్బులకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు.
జిల్లాలోని బీఆర్ఎస్నాయకులు కలిసి కట్టుగా పని చేసి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.