ఈ బరితెగింపు ఏంటీ.. రాసలీలల ఎమ్మెల్యేపై టీడీపీ వేటు

ఆంద్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను  సస్పెండ్ చేసింది టీడీపీ. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలతో  పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. మహిళను వేధించారనే ఆరోపణలను   తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. మరో వైపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అందుబాటులో లేరని తెలుస్తోంది.

రాసలీలల వీడియో వైరల్

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో రాసలీలల్లో పాల్గొంటున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డారంటూ  ఆదిమూలంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  తన పైన ఒత్తిడి తెచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 

అది మార్ఫింగ్ వీడియో: ఎమ్మెల్యే ఆదిమూలం

ఇదిలా ఉండగా.. వైరల్ గా మారిన ఈ వీడియోపై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. తమ పార్టీ నాయకులే తనపై కుట్ర చేశారంటూ చెప్పుకొచ్చారు. సదరు మహిళతో తనకు ఏ సంబంధం లేదని,ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్టు కనబడుతోందని అన్నారు. తానేంటో, తన పనితనం ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసున్నారు ఆదిమూలం.

ALSO READ | టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో..