Pak vs Ban 2024: రిజ్వాన్, షకీల్ సెంచరీలు.. బంగ్లాను భయపెడుతున్న పాక్

రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ పై జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్, కొత్త వైస్ సౌద్ షకీల్ సెంచరీలతో కదం తొక్కారు. రిజ్వాన్ (116), షకీల్ (113) క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 196 పరుగులు జోడించారు. వీరి జోడీ విడదీయడానికి బంగ్లా బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 

ALSO READ | Aussie U-19: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎంపికైన ముగ్గురు భారత మహిళలు

4 వికెట్ల నష్టానికి 158 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన పాకిస్థాన్ అదే జోరు కొనసాగించింది. రిజ్వాన్, షకీల్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బంగ్లా బౌలర్లను స్వేచ్ఛగా ఆడేశారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలతో పాటు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో రోజు బంగ్లా బౌలర్లకు ఒక్క వికెట్ దక్కలేదు. అంతకముందు పాక్ బ్యాటర్ సైమ్ అయూబ్ హాఫ్ సెంచరీతో రాణించారు. అబ్దుల్ షఫీక్ (2), బాబర్ అజాం (0), కెప్టెన్ షాన్ మసూద్ (6) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమ్మద్, షోరిఫుల్ ఇస్లాం తలో రెండు వికెట్లు తీసుకున్నారు.