BAN vs PAK: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్.. వైస్ కెప్టెన్‌గా సౌద్ షకీల్‌

బంగ్లాదేశ్‌తో ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) జట్టును ప్రకటించింది. షాన్ మసూద్ నాయకత్వంలో 17 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా చోటు దక్కించుకున్నాడు. షా 13 నెలల క్రితం తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 

పాకిస్థాన్ జట్టులో అనూహ్య మార్పు ఏంటంటే.. వైస్ కెప్టెన్‌గా సౌద్ షకీల్‌ను నియమించడం. ఆ జట్టు ప్రధాన పేసర్, షాహిద్ ఆఫ్రిది అల్లుడు షాహీన్ అఫ్రిదిని వైస్ కెప్టెన్‌గా తప్పించిన సెలక్టర్లు అతని స్థానంలో షకీల్‌కు బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు, రెండేళ్ల క్రితం చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అలీని రీకాల్ చేశారు.

బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు పాకిస్థాన్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, ముహమ్మద్ హుర్రైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, సైమ్ అయూబ్, అఘా సల్మాన్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది.