పిట్లం,వెలుగు : కాంగ్రెస్ టికెట్ఆశించి భంగపడ్డ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తానని ప్రకటించారు. బుధవారం పెద్దకొడప్గల్లో తన అనుచరులతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో పదిసార్లు ఎన్నికలు జరగగా, తొమ్మిది సార్లు పార్టీ తనకే టికెట్కేటాయించిందన్నారు. 42 ఏండ్లు పార్టీకి సేవ చేశానని, పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవడం బాధగా ఉందన్నారు. గురువారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తానని తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో బీసీ సామాజికవర్గానికి చెందిన లక్ష్మీకాంత్‌రావు తిరస్కరణకు గురవుతారని అన్నారు.
Also Read :- గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్
1999 ఘటన పునారవృతం అవుతుందా?
జుక్కల్ కాంగ్రెస్అభ్యర్థిగా తోట లక్ష్మీ కాంత్రావుకు అధిష్టానం టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే గంగారాం స్వతంత్రంగా పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నారు.1999 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధిష్టానం గంగారాంకు టికెట్ఇవ్వకుండా డి.రాజేశ్వర్‌కు ఇచ్చింది. గంగారాం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్అభ్యర్థి ఓటమికి కారణమయ్యారు. ఓట్లు చీలడంతో టీడీపీ నుంచి పోటీ చేసిన అరుణతార సునాయసంగా గెలిచారు. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందా అనే చర్చ మొదలైంది. అయితే అప్పటి పరిస్థితులు ప్రస్తుతం లేవని, కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గమనిస్తున్నారని, పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పట్టుదలతో ఉన్నారని కాంగ్రెస్‌వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.