- పాక్ లోని పెషావర్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా గేర్ బాక్స్ ఫెయిల్
- ప్రయాణికులందరూ సురక్షితం
ఇస్లామాబాద్: సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్న 300 మంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విమానం రియాద్ నుంచి పాకిస్తాన్ లోని పెషావర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం గేర్ బాక్స్ ఫెయిలై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వెంటనే గమనించి విమానంలోని పైలట్లను అప్రమత్తం చేశారు.
అదే సమయంలో ఎయిర్ పోర్ట్ ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలకు సమాచారం చేరవేశారు. రెస్క్యూ టీమ్ లు వెంటనే విమానం గేర్ బాక్స్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసి భారీ అగ్నిప్రమాదం నుంచి కాపాడాయి. దీంతో 300 మందికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఫ్లైట్ లో 276 276 మంది ప్యాసింజర్లు, 21 మంది విమాన సిబ్బంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డుకు చెందిన బృందం దర్యాప్తు జరుపుతుందని చెప్పారు.