పాకిస్తాన్ లో సౌదీ విమానానికి మంటలు : ఆ తర్వాత ఏం జరిగింది..?

పాకిస్తాన్ లో సౌదీ విమానానికి మంటలు : ఆ తర్వాత ఏం జరిగింది..?

రియాద్ నుంచి వచ్చిన సౌదీ ఎయిర్ లైన్స్ విమానం పాకిస్థాన్ లోని పెషావర్ విమానాశ్రయంలో గురువారం ( జూలై 11) ల్యాండ్ అవగానే మంటలు చెలరేగాయి. రియాద్ నుంచి పెషావర్ కు SV792 ఫ్లైట్ ను పాకిస్తాన్ లోని పెషావర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు టైర్ పేలిపొగలు వచ్చాయి. 

ఎయిర్ లైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ ట్రాఫిక్  కంట్రోలర్లు ల్యాండదింగ్ సమయంలో విమానం ఎడవ వైపు ల్యాండింగ్ గేర్ నుంచి పొగ, స్పార్క్ లను గమనించి వెంటనే  పైలట్లు, ఫైర్ సిబ్బంది, రెస్క్కూ టీంలకు సమాచారం ఇచ్చారు. విమానం ల్యాండ్ కాగానే ల్యాండింగ్ గేర్ ను చుట్టుముట్టిన మంటలను సక్సెస్ ఫుల్ గా ఆర్పివేశారు. 

 రియాద్ నుంచి పెషావర్ కు SV792 ఫ్లైట్ లో మొత్తం 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది ఉన్నారు.  వీరిని స్లయిడ ను ఉపయోగించి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటన అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.