అమెరికా బాటలోనే సౌదీ అరేబియా : భారతీయుల విజిటింగ్ వీసాలపై ఏడాది బ్యాన్.. ఎందుకంటే..!

అమెరికా బాటలోనే సౌదీ అరేబియా : భారతీయుల విజిటింగ్ వీసాలపై ఏడాది బ్యాన్.. ఎందుకంటే..!

తమ దేశంలోని అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపింది. భారతీయులకు సంకెళ్లు వేసి మరీ.. యుద్ధ విమానాల్లో ఇండియాలో దింపి వెళుతుంది ఆ దేశం. ఇప్పుడు అమెరికా బాటలోనే సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకున్నది. భారతీయుల విజిటింగ్ వీసాలపై ఏడాది నిషేధం విధించింది. భారత్ తోపాటు మొత్తం 14 దేశాల విజిటింగ్ వీసాలపై బ్యాన్ విధించింది సౌదీ అరేబియా. విజిటింగ్ వీసాలపై సౌదీ బ్యాన్ ఎందుకు.. ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకుందాం..

ALSO READ | ట్రంప్ మరో కీలక నిర్ణయం.. 10 వేల మందిలో 9,700 మంది ఉద్యోగులు ఔట్..!

ఒక సంవత్సరం పాటు విజిటింగ్ వీసాలపై బ్యాన్ విధిస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది సౌదీ అరేబియా.. ఈ బ్యాన్ ఇండియా సహా 14దేశాలకు వర్తించనుంది. ప్రస్తుతం ఉన్న వీసా పాలసీని సవరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సౌదీ అరేబియా. విజన్ 2030లో భాగంగా అంతర్జాతీయ టూరిస్టులను, ఇన్వెస్టర్లను అకార్చించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన క్రమంలో సౌదీ అరేబియా ఈ నిర్ణయం ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది.

వీసా బ్యాన్ వర్తించే దేశాలు:

  • ఇండియా
  • పాకిస్తాన్
  • బంగ్లాదేశ్
  • ఇండోనేషియా
  • ఫిలిప్పీన్స్
  • వియత్నాం
  • ఇథియోపియా
  • కెన్యా
  • ఉగాండా
  • నైజీరియా
  • మయన్మార్
  • ఆఫ్ఘనిస్తాన్
  • సిరియా
  • యెమెన్

ఏ అంశాలపై బ్యాన్ ప్రభావం ఉంటుంది:

కుటుంబ సంబంధాలపై ప్రభావం: సౌదీ అరేబియాలో నివసిస్తున్న ఇతర దేశీయులకు ఫ్యామిలీని కలిసేందుకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. 

పర్యాటకంపై ప్రభావం: ఈ సస్పెన్షన్ ఈ దేశాల నుండి వచ్చే పర్యాటక ఆదాయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఎందుకంటే 
తరచుగా వచ్చే విజిటర్స్ సౌదీ అరేబియాకు ప్రయాణించేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. 

దౌత్య సంబంధాలు: సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావిత దేశాలతో దౌత్యపరమైన సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

బిజినెస్ ట్రావెల్ : సౌదీ అరేబియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు లేదా సౌదీ సంస్థలతో భాగస్వామ్యం ఉన్న కంపెనీలపై ప్రభావం ఉంటుంది, ఎందుకంటే తరచూ సౌదీకి ప్రయాణించాలంటే ఖర్చు పెరిగే అవకాశం ఉంది. 

టూరిజం : సౌదీ అరేబియా టూరిస్ట్ ఫ్రెండ్లి దేశంగా ప్రాజెక్ట్ చేసుకుంటున్న క్రమంలో ఈ సస్పెన్షన్ టూరిజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సౌదీకి టూరిజం ద్వారా వచ్చే ఆదాయంపై కూడా ప్రభావం ఉంటుంది