Soudi Arabia: అమెరికా బాటలో సౌదీ..14దేశాల వీసాల బ్యాన్..లిస్టులో ఇండియా

Soudi Arabia: అమెరికా బాటలో సౌదీ..14దేశాల వీసాల బ్యాన్..లిస్టులో ఇండియా

సౌదీ అరేబియా కూడా అమెరికాలో బాటలో నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా14 దేశాలకు వీసాల జారీని నిలిపివేసింది..వీసాల రద్దు దేశాల జాబితాలో ఇండియా కూడా ఉంది. అర్జీరియా, బంగ్లాదేశ్,ఈజిప్టు, ఇండోనేషియా, ఇరాక్, జోర్డాన్, మొరాకో, నైజిరియా, పాకిస్తాన్, సుడాన్,టునీషియా, యెమెన్ దేశాలకు వీసాల జారీని నిలిపివేసింది. దేశంలోని వలసల నియంత్రణ, పర్యాటకుల రద్దీకి అడ్డుకట్ట వేసేందుకే 2025 జూన్ వరకు వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేసింది. 

సౌదీ మీడియా ప్రకారం.. 2025 జూన్ హజ్ యాత్ర ముగిసే వరకు సౌదీ ప్రభుత్వం ఉమ్రా (ఇస్లామిక్ తీర్థయాత్ర కోసం వీసా), వ్యాపారం,కుటుంబ విజిట్ వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 13 నుంచి పైన తెలిపిన14 దేశాలకుఉమ్రా వీసాలు జారీ  నిలిపివేయనున్నారు. దౌత్య వీసాలు, రెసిడెన్సీ పర్మిట్లు, ప్రత్యేక హజ్- వీసాలన్న రిజిస్టర్డ్ యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించవచ్చని తెలిపింది. 

Also Read : కెనడా పార్లమెంట్​కు తాళాలు

ఈ 14 దేశాలకు చెందిన యాత్రికులు ఉమ్రా వీసాలు, విజిట్ వీసాలను దుర్వినియోగం చేస్తూ పవిత్ర నగరమైన మక్కాలో చట్టవిరుద్దంగా ఉంటున్నారని అందుకోసం వీసాల జారీ నిలిపివేస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. దేశంలో చట్టవిరుద్దంగా ఉన్నట్లు గుర్తిస్తే ఐదేళ్ జైలు శిక్ష.. రూ. 2.28 లక్షల జరిమానా విధించబడుతుందని అన్ రిజిస్టర్డ్ యాత్రికులకు సౌదీ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.