రూ.700కే అన్ లిమిటెడ్ పాప్ కార్న్: జనం ఎలా తీసుకెళ్లారో చూస్తే నవ్వులే నవ్వులు..!

రూ.700కే అన్ లిమిటెడ్ పాప్ కార్న్: జనం ఎలా తీసుకెళ్లారో చూస్తే నవ్వులే నవ్వులు..!

మల్టీఫ్లెక్స్లో పాప్ కార్న్ అంటేనే బంగారం ధరతో పోటీ పడుతుంది. 200 గ్రాముల పాప్కార్న్ 400 రూపాయలకు ఏ మాత్రం తక్కువ ఉండదు. అలాంటిది ఓ మల్టీఫ్లెక్స్ 700 రూపాయలకే అన్ లిమిటెడ్.. మీకు ఎంత కావాలంటే అంత పాప్ కార్న్ ఇస్తానని చెప్పింది.. ఈ ఆఫర్ గురించి తెలిశాక జనాలు ఏం చేశారో.. ఎంతెంత పాప్ కార్న్.. ఎలా తీసుకెళ్లారో తెలిస్తే అవాక్కవుతారు.. అమ్మో ఇలా కూడా పాప్ కార్న్ తీసుకెళతారా అని నవ్వుకుంటారు.. ఈ భలే భలే ఆఫర్ ఎక్కడో చూద్దాం..

సౌదీ అరేబియాలో వీఓఎక్స్ సినిమాస్ అనే పేరుతో ఒక విలాసవంతమైన మల్టీప్లెక్స్ ఉంది. ఈ మల్టీప్లెక్స్ పాప్కార్న్పై బీభత్సమైన ఆఫర్ ప్రకటించింది. 30 రియాల్స్.. మన కరెన్సీలో 700 రూపాయలు చెల్లిస్తే అన్ లిమిటెడ్ పాప్ కార్న్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ కారణంగా ఎన్నడూ సినిమా థియేటర్ మొఖం కూడా ఎరగని వాళ్లంతా ఈ మల్టీప్లెక్స్ పాప్ కార్న్ ఆఫర్కు టెంప్ట్ అయిపోయి Saudi Arabia VOX Cinemas మల్టీప్లెక్స్కు క్యూ కట్టారు. సినిమాలపై పెద్దగా ఆసక్తి లేని వాళ్లు కూడా అన్ లిమిటెడ్ పాప్ కార్న్ తినడమే కాకుండా తీసుకెళ్లొచ్చనే కారణంగా ఈ మల్టీప్లెక్స్లో కిక్కిరిసిపోయారు.

ఇక.. కొందరైతే అత్యుత్సాహంతో పెద్దపెద్ద నీళ్ల డ్రమ్ములు, ఇళ్లలో వండుకునే పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు తీసుకుని ఈ మల్టీప్లెక్స్ కు వచ్చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా టికెట్ కౌంటర్ దగ్గర సంగతేమో గానీ పాప్ కార్న్ కౌంటర్ దగ్గర మాత్రం జనాలు బారులుతీరారు. అయితే.. ఈ వీడియోపై ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే.. ఇది సౌదీ అరేబియాలోని మల్టీప్లెక్సా.. కాదా అనే విషయంలో స్పష్టత లేదు. వీడియో అయితే ఫుల్ వైరల్ అయింది.

ALSO READ | Viral Video: హార్ట్ టచింగ్ సీన్..అనారోగ్యంతో ఉన్న కేర్‌టేకర్‌ను పరామర్శించిన ఏనుగు

వాస్తవానికి సౌదీ అరేబియాలో ఒకప్పుడు సినిమాలను నిషేధించారు. 35 ఏళ్ల తర్వాత 2018లో సినిమాలపై నిషేధాన్ని సౌదీ ప్రభుత్వం ఎత్తివేసింది. అప్పటి నుంచి సౌదీ అరేబియాలోని ప్రజలు వినోదం కోసం సినిమా థియేటర్లకు వెళుతున్నారు. ఇప్పటికీ సౌదీలో పరిమిత సంఖ్యలోనే థియేటర్లు ఉన్నాయి.