న్యూఢిల్లీ : జార్ఖండ్ లెఫ్టార్మ్ బ్యాటర్ సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. రాజస్తాన్‌తో ఈ నెల 17 నుంచి జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. 17 ఏళ్ల కెరీర్‌లో జార్ఖండ్‌కు ఎక్కువగా ఆడిన సౌరభ్ టీమిండియా తరఫున మూడు వన్డేల్లో బరిలోకి దిగాడు.
ఐపీఎల్‌లో నాలుగు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ‘క్రికెట్ జర్నీకి రిటైర్మెంట్ చెప్పడం కాస్త కష్టమైన పనే. ఎందుకంటే నా స్కూలింగ్ కంటే ముందే ఇది మొదలైంది. అయితే వీడ్కోలు పలకడానికి ఇదే సరైన టైమ్ అని అనుకుంటున్నా. నేషనల్ టీమ్, ఐపీఎల్‌లో లేనప్పుడు కెరీర్‌లో కొనసాగడం కూడా వృథాయే’ అని తివారీ వ్యాఖ్యానించాడు. 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 8030 రన్స్ చేసిన తివారీ 22 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు సాధించాడు. 93 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1494 రన్స్ చేశాడు.