ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే 

ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే 

ఆసిఫాబాద్, వెలుగు: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, ప్రతి వర్షపు నీటిబొట్టును వృథా చేయకుండా ఒడిసి పట్టాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే  అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట వాటర్ షెడ్ ప్రాజెక్టు పరిధిలోని పాడిబండ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ - వాటర్ షెడ్ ప్రత్యేక అధికారి ప్రకాశ్, డీఆర్డీఓ  దత్తారావు లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, ప్రకృతిని కాపాడాలని భవిష్యత్తు తరాలకి  నీటిని అందించాలని సూచించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ రోహిత్ కుమార్,  ఎంపీడీవో  శ్రీనివాస్, వాటర్ షెడ్ అధికారి ఆంజనేయులు, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.