ఉస్మానియా యూనివర్సిటీని కాపాడండి: హైడ్రా కమిషనర్‌కు OU స్టూడెంట్స్ వినతి

హైడ్రా పేరుతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్న ఆ శాఖ కమిషనర్ రంగనాథ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కీలక విజ్ఞప్తి చేశారు. ఆక్రమణకు గురవుతున్న యూనివర్సిటీ భూములను కాపాడాలని ఆయనను కోరారు. రాజకీయ నేతల పలుకుబడితో స్థానిక లీడర్లు యూనివర్సిటీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు విద్యార్థులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. 

వందేళ్ల కిందట ఆవిర్భవించిన ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కాపాడాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారైనా కాస్త చొరవ తీసుకొని చదువుల తల్లి భూములు కాపాడాలని విద్యార్థులు కోరారు.