అసలేం జరుగుతోంది: ఏపీలో ప్రైవసీకి ముప్పు... వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలోకి..

అసలేం జరుగుతోంది: ఏపీలో ప్రైవసీకి ముప్పు... వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలోకి..

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య సోషల్ రచ్చ పీక్స్ కి చేరింది.. ట్రోల్స్, మార్ఫింగ్స్ తో మొదలైన వివాదం ఇప్పుడు ఏకంగా వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు వాటిల్లే స్థితికి చేరింది. సోషల్ మీడియాలో నెలోకన్న గందరగోళం చూస్తోంటే.. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. తాజాగా.. సోషల్ మీడియాలో వేదికగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. కేవలం ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వటం సోషల్ మీడియా కార్యకర్తల ప్రాణాలకే ప్రమాదం కలిగించేలా ఉంది.

పోలీసుల దగ్గర మాత్రమే ఉండాల్సిన సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు. రహస్య సమాచారమైన లొకేషన్ లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ తో సహా ఐఎంఈఐ నంబర్లు వంటి సమాచారాన్ని జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు ట్విట్టర్లో పోస్ట్ చేసి బెదిరిస్తున్నారనివాపోయాడు ఓ నెటిజన్ .ఈ పోస్టులతో తనకు ప్రాణహాని కలిగేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సదరు నెటిజన్.

Also Read:-బంగారం ధర ఇంత భారీగా పెరిగిందేంటి.. పుష్ప-2 టికెట్ రేట్ల మాదిరిగా..!

 

ఈ అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.. ప్రభుత్వం ఈ అంశాన్ని  సీరియస్ గా తీసుకోవాలని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ మేరకు సేవ్ ప్రైవసీ ఇన్ ఏపీ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.