రెండేండ్ల పాటు ఆర్టీసీ కష్టాల్లో ఉంది

కల్లూరు, వెలుగు: ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్​ సూచించారు. కల్లూరులో ఏర్పాటు చేసిన కొత్త బస్టాండ్ ను శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రెండేండ్ల పాటు ఆర్టీసీ కష్టాల్లో ఉందని చెప్పారు.   బడ్జెట్ లో రూ.1500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి అండగా నిలవాలని కోరారు. అనంతరం బస్టాండ్  నిర్మాణానికి సహకరించిన దాతలను శాలువాతో మంత్రి సత్కరించారు. కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్, సర్పంచ్ లక్కినేని నీరజ, ఆర్అండ్ బీ ఈఈ హేమలత పాల్గొన్నారు.