Save The Tigers 2: సేవ్ ది టైగెర్స్ సీజన్ 2కి సూపర్ రెస్పాన్స్.. సీజన్ 1కి మించి

నటులు ప్రియదర్శి(Priyadarshi), కృష్ణ చైతన్య(Krishna Chaitanya), అభినవ్ గోమతమ్(Abhinav Gomatham) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగెర్స్(Save The Tigers). గత సంవత్సరం ఓటీటీకి వచ్చి మంచి విజయాన్ని సాధించిన ఈ సిరీస్ లో జోర్దార్ సుజాత(Sijatha), పావని గంగిరెడ్డి(Pavani Gangireddy), తేజస్విని శర్మ(Tejaswini sharma) ఫి మేల్ లీడ్స్ చేశారు. డిస్నీ+హాట్ స్టార్‌ లో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సిరీస్ కు సీజన్ 2ని ప్లాన్ చేశారు మేకర్స్. ఈ కొత్త సీజన్ మార్చ్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ కొత్త సీజన్ కి కూడా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ, భార్యభర్తలు వారి మధ్య వచ్చే చిన్న చిన్న కలహాలు, చిలిపి అల్లరులు వంటి వాటిని చాలా ఫన్నీ అండ్ కామెడీ వేలో ప్రెజెంటే చేశాడు దర్శకుడు అరుణ్ కొత్తపల్లి. ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలే సన్నివేశాలుగా ఉండటంతో ప్రతీ ఆడియన్ ఈ సిరీస్ కు ఈజీగా కనెక్ట్ అవుతారు. దాంతో ప్రస్తుతం మంచి వ్యూవర్షిప్ తో  డిస్నీ+హాట్ స్టార్‌ లో దూసుకుపోతోంది ఈ సిరీస్. 

ALSO READ | Venky sequel: మీమ్ లవర్స్ గెట్ రెడీ.. వెంకీ సీక్వెల్పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఆడియన్స్ నుండి ఇంత భారీ ఎత్తున రెస్పాన్స్ రావడంతో ఆ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు మేకర్స్. ఇదే విషయం గురించి యూనిట్ మాట్లాడుతూ.. సేవ్ ది టైగెర్స్ సీజన్ 2కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోందో. ప్రస్తుతం ఈ సిరీస్ రికార్డ్ వ్యూయర్షిప్ తో దూసుకుపోతోంది. సీజన్ 1కి మంచి వస్తున్న రెస్పాన్స్ చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్.