అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అజిత్‌కు జంటగా త్రిష నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు పెంచిన మేకర్స్.. ప్రమోషన్‌లో స్పీడు పెంచుతూ శుక్రవారం ఓ పాటను విడుదల చేశారు.
‘సవదీక’ అంటూ సాగే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్‌ను అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేశాడు. ఆంథోని దాసన్ పాడాడు. సాంగ్ బీట్‌కు తగ్గట్టుగా అజిత్, త్రిష జంట ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇంప్రెస్ చేశారు. ఇక అర్జున్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా జనవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.