పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పనిచేస్తామని పార్టీ లీడర్లు తెలిపారు. రంజాన్ వేడుకల్లో పాల్గొని మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న వంశీని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ సీనియర్ నాయకులు సయ్యజ్ సజ్జాద్, బాలసాని సతీశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ లీడర్ సజ్జాద్ మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారన్నారు.