నకిలీ పాస్​పోర్టు కేసులో ఎస్బీ ఏఎస్ఐ అరెస్టు

నకిలీ పాస్​పోర్టు కేసులో ఎస్బీ ఏఎస్ఐ అరెస్టు

నిజామాబాద్, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లతో పాస్​పోర్టులు తయారు చేసిన కేసులో స్పెషల్​ బ్రాంచ్​ (ఎస్బీ) ఏఎస్ఐ లక్ష్మణ్ ను హైదరాబాద్​ సీఐడీ పోలీసులు మంగళవారంఅరెస్టు చేశారు. నిజామాబాద్  నగరంలోని గంగాస్థాన్​ కాలనీలో నివాసముంటున్న ఆయన ఇంటికి సీఐడీ పోలీసులు ఉదయం చేరుకుని లక్ష్మణ్​ ను అరెస్టు చేశారు. జిల్లాలోని మాక్లూర్, నవీపేట మండలాలకు ఆయన స్పెషల్​ బ్రాంచ్​ ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు.

పాస్​పోర్టులు పొందడానికి డాక్యుమెంట్ల స్థానంలో బోగస్​ పత్రాలు తయారు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయా జిల్లాలకు చెందిన 14 మందిని ఇప్పటికే అరెస్టు చేయగా జిల్లాలోని భీంగల్​కు చెందిన సుభాష్​ కూడా వారిలో ఉన్నారు.  సుభాష్​ను విచారించిన తరువాత  లక్ష్మణ్​ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్  తీసుకెళ్లారు.