గద్వాల జిల్లాలో పేకాట స్థావరంపై దాడి : రూ 6.36 వేలు స్వాధీనం

గద్వాల జిల్లాలో పేకాట స్థావరంపై దాడి : రూ 6.36 వేలు స్వాధీనం

గద్వాల/పెబ్బేరు, వెలుగు : పేకాట స్థావరంపై ఎస్​బీ, వనపర్తి పోలీసులు దాడి చేసి 16 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్​ చేసి వారి నుంచి రూ.6.36 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాస్​రావు తెలిపారు. గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది అవతలి వైపు ఉన్న రంగాపూర్  శివారులోని ఓ గోదామ్​లో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం దాడి చేసినట్లు పేర్కొన్నారు. స్పెషల్  బ్రాంచ్  సీఐ నాగేశ్వర్ రెడ్డి, ఇటిక్యాల ఎస్ఐ వెంకటేశ్​తో పాటు వనపర్తి జిల్లాకు చెందిన పోలీసుల ఆధ్వర్యంలో దాడి చేశామని, నగదుతో పాటు 4 కార్లు, 4 బైక్స్, 15 మొబైల్స్  స్వాధీనం చేసుకొని పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించినట్లు  తెలిపారు.