ఎస్​బీఐ లక్ష్యం .. రూ.లక్ష కోట్ల లాభం : బ్యాంకు చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి

ఎస్​బీఐ లక్ష్యం .. రూ.లక్ష కోట్ల లాభం : బ్యాంకు చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి

న్యూఢిల్లీ: వచ్చే 3–-5 ఏళ్లలో రూ. లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటిన తొలి భారతీయ ఆర్థిక సంస్థగా అవతరించాలని స్టేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ) లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ చైర్మన్​ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. 2024లో ఈ బ్యాంకు 21.59 శాతం వార్షిక వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది.

కంపెనీల నుంచి బ్యాంక్ ఇప్పటికే రూ. 4 లక్షల కోట్ల బలమైన క్రెడిట్ పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ను సాధించిందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం పెరుగుతుందని శెట్టి చెప్పారు.  కొన్ని కార్పొరేట్ సంస్థలు బ్రౌన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ విస్తరణను చేపట్టాయని, దీని కోసం టర్మ్ లోన్లు తీసుకుంటున్నాయని శెట్టి అన్నారు