ఫ్లైట్లో హైదరాబాద్కు.. అక్కడ నుంచి రావిరాల SBI ఏటీఎంకు.. 3 నిమిషాల్లో 29 లక్షలు కాజేసి జంప్..!

ఫ్లైట్లో హైదరాబాద్కు.. అక్కడ నుంచి రావిరాల SBI  ఏటీఎంకు.. 3 నిమిషాల్లో 29 లక్షలు కాజేసి జంప్..!

హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల SBI  ఏటీఎం చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్  సీపీ ఆఫీస్ నుంచి రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

మార్చి 2వ తేదీన రావిరాల గ్రామంలోని SBI ఏటీఎంలో 30 లక్షలను దొంగలు చోరీ చేశారు. చోరీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘జులాయి’ సినిమా తరహాలో రాజస్థాన్, హర్యానా ముఠా ఏటీఎంలో డబ్బులు కొట్టేశారు. ఏటీఎంను కట్ చేసి దోచుకునేందుకు నిందితులు ఫ్లైట్లో హైదరాబాద్ కు వచ్చి.. అక్కడ నుంచి రావిరాల చేరుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

రావిరాల SBI  ఏటీఎం చోరీపై రాచకొండ సీపీ చెప్పిన విషయాలివి:
* 3 నిమిషాల్లో ఏటీఎంలో ఉన్న 29 లక్షలు కాజేశారు
* గతంలో కుషాయిగూడ, BDL బానూర్, ఒడిశాలో ఏటీఎంలను కొల్లగొట్టారు 
* HDFC, SBI ఏటీఎంలను టార్గెట్ చేశారు
* ఈ కేసును ఛేదించేందుకు చాలా కష్టపడ్డాం
* నిందితులు మొత్తం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ
* హైదరాబాద్కు చెందిన రాహుల్ అనే వ్యక్తి కీలక సూత్రధారి
* హర్యానాలో ఉన్న ఒకే గ్రామానికి చెందిన నిందితులు వీళ్ళు 
* నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏటీఎంలే వీరి టార్గెట్ 
* ఒకే రోజు రెండు ఏటీఎంలను కొల్లగొట్టారు

రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడా మునిసిపాలిటీలో రావిరాల వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను  దోచుకున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మార్చి 2 అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హర్యాణాలోని మేవాత్ జిల్లాకు చెందిన ఈ ముఠా, గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి, సీసీ కెమెరాలపై స్ప్రే పెయింట్ చల్లి, ముఖాలకు మాస్కులు ధరించి కేవలం 6 నిమిషాల్లో రూ.29,69,900 చోరీ చేసి పరారైంది.

Also Read:-అప్పుల ఊబిలో ఇండియన్ మిడిల్‌క్లాస్ ప్రజలు..

ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి, 22 రోజుల పాటు విచారణ జరిపారు. మేవాత్ జిల్లాకు చెందిన ఈ దొంగలు  ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో  చోరీలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో చోరీలు చేసి స్వస్థలాలకు పారిపోతారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై దోపిడీలకు పాల్పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి.