జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి ఒంటిగంటకు గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎం చోరీ చేశారు. అయితే పోలీసులు వెళ్లేసరికి నగదు దొంగిలించి బాక్సులను కార్లలో పెట్టుకొని దొంగలు సిద్దంగా ఉన్నారు. పోలీసులు వెళ్లి కారును ఢీ కొట్టడంతో దొంగలు నగదును పడేసి తలోవైపు పారిపోయారు. దీంతో నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. మొత్తం రూ.19లక్షల 200 నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్యాష్ అంత సేఫ్ గా ఉన్నట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు. పారిపోయిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఏటీఎంలో చోరీ జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన ఏటీఎం ప్రత్యేక నిఘా విభాగం హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ని అలర్ట్ చేసింది. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ ని బ్యాంక్ అధికారులు అలర్ట్ చేశారు. దీంతో పోలీసులు చాకచక్యంగా సమయానికి వెళ్లి డబ్బును ఎత్తుకెళ్లకుండా అడ్డుకున్నారు.