సీఎంఆర్ఎఫ్​కు ​ఎస్బీఐ, అరబిందో ఫార్మా రూ.5 కోట్ల చొప్పున విరాళం

  • ఏఐజీ హాస్పిటల్స్​ రూ. కోటి అందజేత

హైదరాబాద్​, వెలుగు : వరద బాధితుల సహాయర్థం రాష్ట్ర ఎస్బీఐ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం రూ.5 కోట్లను సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు. రూ.5 కోట్ల చెక్కును ఎస్బీఐ సీజీఎం రాజేశ్ కుమార్.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు స్వయంగా అందజేశారు. అలాగే..అరబిందో ఫార్మా కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5కోట్లు విరాళంగా అందించింది.

సీఎం, డిప్యూటీ సీఎంలకు చెక్కును అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్,  ఎండీ కె.నిత్యానంద రెడ్డి, కంపెనీ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి అందించారు. ఏఐసీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి రూ. కోటి చెక్కును సీఎం, డిప్యూటీ సీఎంలకు అందించారు. కాగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

బాధితులకు అండగా నిలవడానికి వివిధ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు,  దాతలు విరాళాలను అందిస్తూ బాధితులకు తోడుగా నిలుస్తున్నారు. ఎంపీ మల్లు రవి కూడా తన ఒక నెల వేతనాన్ని సీఎంఆర్​ఎఫ్​కు అందజేశారు. ఆపద సమయంలో వరద బాధితులకు తోడుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.wwww