![ఇన్సూరెన్స్ తీసుకుంటేనే లోన్: రైతులను బెదిరిస్తున్న ఎస్బీఐ బ్యాంక్ ఆఫీసర్లు](https://static.v6velugu.com/uploads/2025/02/sbi-bank-in-warangal-demanding-insurance-for-crop-loans_AdcIb6t1ri.jpg)
వర్ధన్నపేట, వెలుగు: ఇన్సూరెన్స్ తీసుకుంటేనే క్రాప్ లోని వస్తుందని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్బీఐ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటన మంగళవారం జరిగింది. పట్టణానికి చెందిన రైతు బొంత విజయ తన రెండు ఎకరాల భూమికి సంబంధించిన క్రాప్ లోన్ ఇస్తామని అధికారులు ఫోన్ చేసి చెప్పడం తో బ్యాంకుకు వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఆమెకు రూ. 12 వేలు కట్టాలని ఇది మీ ఇన్యూరెన్స్ ఫారం అని అక్కడి అధికారులే నింపి ఇచ్చి, మీవయస్సు
పెరిగే కొద్ది పైసలు పెరుగుతాయని చెప్పడంతో కంగుతిన్నారు. ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మీకు లోన్ వస్తుందని లేదంటే లోన్ రాకుండా చూస్తామని చెప్పడంతో రైతులకు చెప్పకుండా ఫారం ఎలా నింపుతారని బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ను ప్రశ్నించగా సదరు అధికారిపై ఫిర్యాదు. చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే విషయమై బ్యాంకు మేనేజర్ను సంప్రదించగా. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.