సన్ డే, సెకండ్ శాటర్డే, పండగ రోజులు.. ఇలా సంవత్సరంలో కొన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, భారత్ లోని ఒకచోట మాత్రం ఓ బ్యాంకు ఏడాదిలో కేవలం నాలుగు నెలలే తెరిచి ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ ల్లో ఉండదు. పూరి గుడిసెలో ఉంటుంది. ఇంతకీ ఇది ఏ బ్యాంకు.. ఈ బ్యాంకు ఎక్కడుంది అంటారా..
ఇండో-చైనా బార్డర్ లోని గుంజి గ్రామంలో ఉంటుందీ బ్యాంకు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ ఈ బ్యాంకును నడిపిస్తోంది. మానససరోవర్ యాత్రికులు, ఇండో-చైనా వాణిజ్యంలో పాల్గొనే వ్యాపారులు ఈ బ్యాంకును ఎక్కువగా వినియోగిస్తుండే వాళ్లు. అయితే, ప్రస్తుతం.. బార్డర్ గొడవల వల్ల ఈ బ్యాంకును పూర్తిగా మూసేసారు అధికారులు. దాంతో గుంజి సహా చుట్టుపక్కల గ్రామాలన్నీ.. బ్యాంక్ సేవలకోసం పక్క ఊళ్లకు వెళ్తున్నారు.
గుంజి గ్రామంలో ఇంటర్నెట్ నిషేదం. కావున బ్యాంక్ సేవల్ని నిలిపివేశాయి. అయితే, ఇంటర్నెట్ బదులు సాటిలైట్ కమ్యూనికేషన్ వాడి బ్యాంకును నడిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బ్యాంకు సదుపాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పక్క ఊళ్లకు వెళ్లి రావాలంటే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.