
దేశంలోనే అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో అర్హులైన అభ్యర్థులు మే 17 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీ పడే అవకాశం ఉండగా హైదరాబాద్ (తెలంగాణ)లో 275 ఖాళీలు ఉన్నాయి. ఎక్కువ మంది యువత పనిచేయాలనుకునే రంగాల్లో బ్యాంకింగ్ ఒకటి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐలో ఉద్యోగం అంటే ఆ ఆసక్తి మరింత పెరుగుతోంది. డిగ్రీ పూర్తి చేసుకున్న వారి కోసం 5454 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఎస్బీఐ అప్లికేషన్స్ కోరుతోంది.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. పరీక్షను ఒక గంటలో నిర్వహిస్తారు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగెటివ్
మార్క్ ఉంటుంది.
మెయిన్స్
ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ చేస్తారు. దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. దీన్ని 200 మార్కులకు నిర్వహిస్తారు. 190 ప్రశ్నలు ఉంటాయి. సమయం 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది.
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్: మెయిన్స్ పరీక్ష అనంతరం విడుదల చేసే మెరిట్ లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము ఎంచుకున్న లోకల్ లాంగ్వేజిని పదో తరగతి లేదా ఇంటర్లో చదివి ఉంటే ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇతరులు తప్పనిసరిగా రాయాలి.
ఖాళీలు: 5454 ( జనరల్–5000, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ బ్యాక్లాగ్–121, పీడబ్ల్యూడీ–96, ఎక్స్ సర్వీస్‌మెన్–237)
హైదరాబాద్ (తెలంగాణ): 275
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయసు: 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఎగ్జామ్ (ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యసమాచారం
దరఖాస్తులు: ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: 27 ఏప్రిల్ 2021
చివరితేది: 17 మే 2021
ప్రిలిమ్స్ పరీక్ష: జూన్ 2021
మెయిన్స్ ఎగ్జామ్: 31 జూలై 2021