
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మేనేజర్, ఇంజినీర్ ఉద్యోగాలు మినహా మిగిలిన అన్ని పోస్టులకు రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. జనరల్ ఆప్టిట్యూడ్, సంబంధిత ప్రొఫెషనల్ నాలెడ్జ్ ను పరిశీలిస్తారు. మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్), ఇంజినీర్ (ఫైర్) ఉద్యోగాలకు మాత్రం అప్లికేషన్లు షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఎస్వో ప్రిపరేషన్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, గురించి తెలుసుకుందాం..
మార్కెట్లో పెరుగుతున్న పోటీ దృష్టిలో పెట్టుకొని, లేటెస్ట్ టెక్నాలజీతో వినియోగదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి వివిధ విభాగాల్లో డిగ్రీ, పీజీ చేసిన వారిని స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌గా ఎస్‌బీఐ రిక్రూట్ చేసుకుంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్
మేనేజర్ (మార్కెటింగ్), డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) ఉద్యోగాలకు రిటెన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఉంటుంది. దీనికి కేటాయించిన సమయం 120 నిమిషాలు. బ్యాంకింగ్ నాలెడ్జ్, డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ అనాలిసిస్, రీజనింగ్, జనరల్ అవేర్ నెస్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ విభాగాల్లో ప్రతిదాని నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్ నాలెడ్జ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. లెటర్ రైటింగ్, ఎస్సేలపై ప్రశ్నలు ఉంటాయి. 50 మార్కులకు జరిగే ఈ పరీక్షను 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. రాత పరీక్ష మొత్తం ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు. ఒక వేళ అదే ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించకపోతే బ్యాంకు నిబంధనల మేరకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్), డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్), అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), ఐటీ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, అప్లికేషన్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ లీడ్ ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ పరీక్ష కింద 75 ప్రశ్నలను 150 మార్కులకు అడుగుతారు. ఈ పరీక్షను 70 నిమిషాల్లో పూర్తి చేయాలి. అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్), డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్), అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్) ఉద్యోగాలకు సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ లో ప్రశ్నలు జనరల్ ఐటీ నుంచి అడుగుతారు. మిగతా పోస్టులకు ఆయా బాధ్యతలకు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
మేనేజర్ (నెట్ వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్), మేనేజర్ (నెట్ వర్క్ రూటింగ్ అండ్ స్విచింగ్ స్పెషలిస్ట్) ఉద్యోగాల ఎంపికకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి.
డిప్యూటీ మేనేజర్(ఇంటర్నల్ ఆడిట్) ఉద్యోగాలకు రాత పరీక్ష ఇంటర్వ్యూ ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (50 మార్కులకు 50 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 ప్రశ్నలకు 35 మార్కులు), ఇంగ్లీష్ (35 మార్కులకు 35 ప్రశ్నలు) విభాగాల నుంచి మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. టైం డ్యురేషన్ 90 నిమిషాలు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ కి 50 ప్రశ్నలు100 మార్కులకు ఇస్తారు. 25 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్), ఇంజినీర్ (ఫైర్) ఉద్యోగాలకు అప్లికేషన్స్ ప్రాసెస్ తర్వాత షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులకు 100 మార్కులకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు.
సిలబస్ అండ్ టిప్స్
రీజనింగ్ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు లాజికల్‌గా ఆలోచించి రాసేలా ఉంటాయి. క్వశ్చన్ ప్యాటర్న్ విశ్లేషిస్తే దాదాపు సమాధానం రాబట్టవచ్చు. నాలుగైదు సంవత్సరాలకు చెందిన అన్ని బ్యాంకు ప్రీవియస్ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను, వాటి మెథడ్స్ ప్రాక్టీస్ చేయాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, కోడింగ్–డీకోడింగ్, డైరెక్షన్స్ అనే 5 టాపిక్‌ల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. వీటితో పాటు అనాలజీ, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్ వంటి వర్బల్ రీజనింగ్ టాపిక్స్ పై దృష్టి పెట్టాలి. మిర్రర్ ఇమేజస్, వాటర్ ఇమేజస్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, ప్యాటర్న్ కంప్లీషన్, ఎంబెడ్డెడ్ ఫిగర్స్ వంటి నాన్‍వర్బల్ రీజనింగ్ అంశాలు ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సిన సబ్జెక్ట్ ప్రిపరేషన్ సమయంలో ఫార్ములాలు, షార్ట్‌కట్స్ రాసుకొని సాధన చేస్తే తక్కువ సమయంలో ఆన్సర్ చేయచ్చు. ఈ విభాగంలో గత పరీక్షల్లో ఎక్కువగా నంబర్ సిరీస్, డేటా సఫీషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ టాపిక్‌ల నుంచి ప్రశ్నలిచ్చారు. అర్థమెటిక్ అంశాలైన పర్సెంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ రూల్స్ పై పట్టు సాధించాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌ల పై ప్రత్యేక దృష్టి సారించాలి. నంబర్ సిరీస్, నంబర్ సిస్టం, సింప్లిఫికేషన్స్, ఎల్‍సీఎం, హెచ్‍సీఎం, రూట్స్ అండ్ క్యూబ్స్, ప్లాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పని–కాలం, పని–దూరం, ట్రైన్స్ లో అన్ని మోడల్స్ చదవాలి.
జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలో బ్యాంకింగ్ రిలేటెడ్ జనరల్ అవేర్నెస్ టాపిక్‌ల మీద దృష్టి పెట్టాలి. ఇండస్ర్టీలో వస్తున్న తాజా మార్పులు, ఫైనాన్షియల్ మార్కెట్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, బ్యాంక్ ఇన్స్యూరెన్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్, మనీ మార్కెట్స్, మనీ ఫంక్షన్స్ అండ్ టైప్స్, బ్యాంక్ లోన్స్ అండ్ డిపాజిట్స్, పథకాలు, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, క్యాపిటల్ అండ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, పి నోట్స్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, స్ర్టక్చర్ ఆఫ్ బ్యాంకింగ్, రీటెయిల్ బ్యాంకింగ్, బ్యాంక్ టెర్మ్స్, బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ సంస్థలు, ఆర్బీఐ, నాబార్డ్, బ్యాంకింగ్ కమిటీలు, మ్యూచ్‌వల్ ఫండ్స్, ఈ పేమెంట్ సిస్టమ్స్ వంటి టాపిక్‌ల నుంచి ప్రశ్నలిస్తారు. ఇందుకు ఏదైనా స్టాండర్డ్ పుస్తకం ప్రిపేరవ్వాలి. బిజినెస్ పుస్తకాలు, పీరియాడికల్స్, మేగజీన్స్ చదవడం వల్ల బ్యాంకింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇందులో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా ప్రశ్నలొచ్చే అవకాశం ఉంది.
పీవో, ఎస్వోలో ఏది బెటర్:
ఎస్‌బీఐ పీవో, ఎస్‌బీఐ ఎస్వో- రెండు పోస్టులకు ఎంపికైతే దేన్ని ఎంచుకోవాలి, రెండింటిలో ఏది మెరుగనే సందేహం సాధారణంగా అభ్యర్థులకు వస్తుంటుంది. రెండు పోస్టుల్లో దేని ప్రయోజనాలు దానికే ఉన్నాయి. జీతభత్యాలు దాదాపుగా ఒకే విధం. ప్రొబేషనరీ ఆఫీసర్ బాధ్యతలు ఖాతాదారులతో నేరుగా సంబంధముండే విధంగా ఉంటాయి. స్పెషలిస్ట్ ఆఫీసర్‌కు అవి తక్కువగా..ఎంపికైన పోస్టుకు తగిన విధంగా నిర్దిష్టంగా ఉంటాయి. పదోన్నతులు కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్లకు దాదాపు స్కేల్-4 వరకు కాస్త వేగంగా ఉండి, ఆ తర్వాత కొద్దిగా నెమ్మదిస్తాయి. ప్రొబేషనరీ ఆఫీసర్లకు ఉన్నత స్థాయి వరకు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. పీవోలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్లకు ఎక్కువగా పట్టణ ప్రాంతాలలోనే తమ విధులను నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇలా రెండింటిలో దేనికి దానికే అనుకూలతలున్నాయి. వాటిని అనుసరించి రెండింటిలో అవకాశం వచ్చినప్పుడు అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్నదాన్ని ఎంచుకోవచ్చు. పీఓతో పోలిస్తే స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులకు పోటీ తక్కువ.
నోటిఫికేషన్
కేడర్: అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు) చెల్లించాలి. వివరాలకు www.sbi.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.