
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు 2024–-25 ఆర్థిక సంవత్సరంలో రూ.509 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.240 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగింది. కంపెనీ తన మొత్తం వ్యాపారంలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. 2023–24లో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు రూ. 12,731 కోట్ల గ్రాస్ రిటన్ ప్రీమియం (జీడబ్ల్యూపీ) రాగా, 2024–25 లో రూ. 14,140 కోట్లు వచ్చాయి. ఇది 11 శాతం ఎక్కువ. కంపెనీ సాల్వెన్సీ రేషియో 2.03గా ఉంది. రెగ్యులేటరీ రూల్స్ ప్రకారం ఉండాల్సిన 1.50 కంటే ఇది చాలా ఎక్కువ అని, కంపెనీ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉందనే విషయం దీనినిబట్టి తెలుస్తోందని ఎస్‌బీఐ జనరల్ పేర్కొంది.