SBI: క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లుపెంచిన ఎస్‌బీఐ 

SBI: క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లుపెంచిన ఎస్‌బీఐ 

క్రెడిట్ కార్డ్ యూజర్లకు స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మరోసారి షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించినప్పుడు విధించే ఛార్జీలను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దీనికి కారణం ఆర్‌‌బీఐ రెపో రేటును పెంచడమేనని ఎస్‌బీఐ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఈ ఛార్జీ రూ.99(టాక్స్ అదనం) ఉండగా, మార్చి 17 నుంచి అదనపు ఛార్జీలు రూ.199 (టాక్స్ అదనం) పెంచనున్నారు. పోయిన ఏడాదే ఎస్‌బీఐ కార్డ్స్ ఈ టాక్స్‌ను పెంచింది. 

ఈ విషయంపై కస్టమర్లకు ఎస్‌బీఐ మెసేజ్‌లు కూడా పంపుతోంది. ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఇప్పటికే అద్దె మొత్తంలో ఒక శాతాన్ని ఛార్జీగా వసూలు చేస్తున్నాయి. ఎస్‌బీఐ.. ఎంసీఎల్‌ఆర్‌‌ను 7.85 శాతం నుంచి 7.95 శాతానికి పెంచనుంది. అయితే, పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తెలిపింది. దీంతో హోంలోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లాంటి ఈఎంఐలు పెరుగుతాయి. ఎస్‌బీఐ లాగానే పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా వడ్డీరేట్లు పెరిగాయి.

మరిన్ని వార్తలు