తగ్గిన మొండిబాకీలు.. 3 నెలల్లో ఎస్‌‌‌‌‌‌‌‌బీఐకి ఊహించని రేంజ్‎లో లాభం

తగ్గిన మొండిబాకీలు.. 3 నెలల్లో ఎస్‌‌‌‌‌‌‌‌బీఐకి ఊహించని రేంజ్‎లో లాభం

న్యూఢిల్లీ: స్టేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ) నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ2) లో రూ.18,331 కోట్లకు ఎగిసింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ. 14,330 కోట్లతో పోలిస్తే ఏకంగా 28 శాతం వృద్ధి చెందింది. వడ్డీల ద్వారా రూ.1.14 లక్షల కోట్ల ఆదాయాన్ని  పొందింది. బ్యాంక్  పొందిన వడ్డీ ఆదాయం, వడ్డీల కింద చేసిన ఖర్చుల   మధ్య తేడా అంటే నికర వడ్డీ ఆదాయం రూ.41,620 కోట్లకు చేరుకుంది.  

కిందటేడాది ఎస్‌‌‌‌‌‌‌‌బీఐకి వచ్చిన  నికర వడ్డీ ఆదాయం రూ.39,500 కోట్లతో పోలిస్తే ఇది 5.37 శాతం  ఎక్కువ. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఐఎం) మాత్రం  ఏడాది ప్రాతిపదికన 15 బేసిస్ పాయింట్లు, క్వార్టర్లీ పరంగా 8 బేసిస్ పాయింట్లు తగ్గి 3.14 శాతానికి పడిపోయింది. వివిధ పబ్లిక్ ఇష్యూలు లేదా ప్రైవేట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్స్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లు సేకరించాలని ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ బోర్డు నిర్ణయించింది. 

తగ్గిన మొండిబాకీలు..

ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ  మొండిబాకీలు క్యూ2 లో కొద్దిగా తగ్గాయి. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.86,974 కోట్లుగా ఉన్న గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలు), ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.83,369 కోట్లకు దిగొచ్చాయి. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్ రూ.84,226 కోట్లుగా రికార్డయ్యింది. గ్రాస్  ఎన్‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో క్యూ2 లో 2.13 శాతానికి మెరుగుపడింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.21 శాతంగా, కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.55 శాతంగా గ్రాస్ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో ఉంది. 

 అలానే నెట్ ఎన్‌‌‌‌‌‌‌‌పీల రేషియో ఏడాది ప్రాతిపదికన 0.64 శాతం నుంచి, క్వార్టర్లీ పరంగా 0.57 శాతం నుంచి 0.53 శాతానికి తగ్గింది. మొత్తంగా క్యూ2 నాటికి ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ నెట్ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏల విలువ రూ.20,294 కోట్లకు దిగొచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి రూ.21,352 కోట్లుగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి  రూ.21,555 కోట్లుగా నెట్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలు ఉన్నాయి. 

 రూ.51.17 లక్షల కోట్ల డిపాజిట్లు..

క్యూ2 లో ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ మొత్తం డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన 9.13 శాతం పెరిగి రూ.51.17 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి  బ్యాంక్ దగ్గర రూ.46.89 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.  ఈ రూ.51.17 లక్షల కోట్ల డిపాజిట్లలో రూ.2.78 లక్షల కోట్ల కరెంట్ అకౌంట్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లు గత ఏడాది కాలంలో 10.05 శాతం పెరిగాయి. 

 సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు రూ.16.88 లక్షల కోట్ల దగ్గర ఫ్లాట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి.  టెర్మ్ డిపాజిట్లు 12.51 శాతం పెరిగి రూ.29.45 లక్షల కోట్లకు, ఫారిన్ ఆఫీసుల్లోని  డిపాజిట్లు రూ.2.07 లక్షల కోట్లకు  చేరుకున్నాయి. ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఇచ్చిన మొత్తం అప్పులు ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి రూ.39.21 లక్షల కోట్లకు చేరుకున్నాయి.  కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి ఇచ్చిన అప్పులతో పోలిస్తే 14.93 శాతం పెరిగాయి. కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు ఇచ్చిన అప్పులు రూ.11.57 లక్షల కోట్లకు పెరగగా,  ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ క్రెడిట్ లోన్లు రూ.4.57 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మరో రూ.6 లక్షల కోట్లను కంపెనీలకు ఇస్తామని  ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ చైర్మన్ సీఎస్‌‌‌‌‌‌‌‌ శెట్టి అన్నారు.