SBI కస్టమర్లకు షాక్: రుణాలపై వడ్డీ రేట్లు పెంపు

SBI కస్టమర్లకు షాక్: రుణాలపై వడ్డీ రేట్లు పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)  వినియోగదారులకు ఇది షాకింగ్ న్యూస్..SBI రుణాలపై వడ్డీ రేట్లు పెంచింది. తన బేస్ లెండింగ్  రేటును 10.10 శాతం నుంచి 10.25శాతానికి పెంచింది. వడ్డీరేట్లలో పెరుగుదల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలలో వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉంది. దేశంలోని ప్రముఖ బ్యాంక్ అయిన మార్జిన్ కాస్ట్ ఆఫ్ లెండింగ్  రేట్ (MCLR) పెరుగుదల 8 శాతం నుంచి 8.15 శాతం మద్య ఉంది. పెరిగిన కొత్త వడ్డీరేట్లు డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి.

MCLR పెరుగుదల కారణంగా అన్ని రకాల లోన్ లపై ఈఎమ్ ఐలు పెరగనున్నాయి. ఇప్పుడు తాజాగా లోన్లు ఆప్లై చేసే వారు అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే లోన్లు తీసుతకున్న వారు ఇకపై కట్టబోయే EMIలను పెరిగిన వడ్డీ రేట్ల ప్రకారం చెల్లించాల్సి ఉంఉంది. 
 
 ఓవర్ నైట్ MCLR  రేటును 8 శాతంగా  నిర్ణయించగా.. ఒక నెల నుంచి మూడు నెలల  కాలపరిమితి కి సంబంధించిన రేట్లు 8.15 శాతానికి పెంచారు. బ్యాంకింగ్ రంగంలో ఆదర్శంగా ఉన్న ఎస్ బీఐ ఉన్నందున ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరించి వడ్డీ రేట్లను పెంచవచ్చని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు.