న్యూఢిల్లీ: ఎస్బీఐ తన లోన్రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లను సెట్ చేయడానికి ఉపయోగించే మార్జినల్ కాస్ట్ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) ను మార్చింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ను 8.10శాతం నుంచి 8.20శాతానికి, ఒక నెల ఎంసీఎల్ఆర్ను 8.35శాతం నుంచి 8.45శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ను 8.40శాతం నుంచి 8.50శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ను 8.75శాతం నుంచి 8.85శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్ను 8.85శాతం నుంచి 8.95శాతానికి పెంచింది.
రెండేళ్ల ఎంసీఎల్ఆర్ను 8.95శాతం నుంచి 9.05శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 9.00శాతం నుంచి 9.10శాతానికి పెంచింది. ఫలితంగా హోంలోన్వంటి లోన్ల వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు లోన్ల కోసం తప్పనిసరిగా ఉపయోగించాల్సిన కనీస వడ్డీ రేటు.