డిపాజిటర్లు ఆకర్షించేందు ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. రెండు కొత్త డిపాజిట్ స్కీంలు హర్ ఘర్ లఖ్ పతి, ఎస్బీఐ పాట్రన్స్ లను శుక్రవారం (జనవరి 03,2025) ప్రారంభించింది.
కస్టమర్ల ఆర్థిక సౌలభ్యం, విలువను విస్తరించేందుకు ఈ స్కీంలను రూపొందించింది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిలో సేవింగ్స్ అవేర్ నెస్ పెరగడంతో లక్ష అంతకంటే ఎక్కువ పొదుపు చేసేందుకు హరఘర్ లఖ్ పతి ప్రీ క్యాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ స్కీంను ప్రారంభించింది.
కస్టమర్లు ఖచ్చితమైన పొదుపు ప్రణాళిక ద్వారా తమ ఫైనాన్షియల్ గోల్స్ ను చేరుకునే లక్ష్యంతో ఈ హర్ ఘర్ లఖ్ పతి స్కీం ను రూపొందించినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు సీనియర్ సిటిజన్ల కోసం ‘SBI పాట్రన్స్ స్కీం’ ప్రత్యేక టర్మ్ డిపాజిట్ స్కీం ను కూడా ప్రారంభించింది. ఈ స్కీం ద్వారా చాలాకాలంగా కస్టమర్లుగా ఉన్న 80 యేళ్లకు పైబడిన వృద్ధులకు మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తుంది. పాత, కొత్త టర్మ్ డిపాజిట్ కస్టమర్లకు SBI పాట్రన్స్ స్కీం అందుబాటులో ఉంది.
ALSO READ | New RBI rule: ఆర్బీఐ కొత్త రూల్స్..ఈ యేడాది పర్సనల్ లోన్స్ పొందడం కష్టమే
సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేట్లకంటే అదనంగా 10 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీని SBI పాట్రన్స్ డిపాజిటర్లు పొందుతారు. అయితే రికరింగ్ డిపాజిట్ పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే రేట్లను పోలి ఉంటుంది.
ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) రేటు సంవత్సరానికి 6.80 శాతం, రెండు సంవత్సరాలకు 7 శాతం, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు వారికి 6.75 శాతం, 5నుంచి -10 సంవత్సరాలకు 6.5 శాతం చెల్లిస్తున్నారు. ఈ రికరింగ్ డిపాజిట్ల కనీస కాలవ్యవధి 12 నెలలు ,గరిష్టం 120 నెలలు (10 సంవత్సరాలు) ఉంటుంది.
ఈ స్కీంలను దేశంలోని అన్ని SBI బ్రాంచులలో పొందవచ్చు. ఖాతా ఓపెనింగ్,డిపాజిట్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు డిజిటల్ ఎక్విప్ మెంట్ వినియోగం ద్వారా విదేశాల్లో కూడా సౌకర్యం ఉంది.