న్యూఢిల్లీ: ‘తక్షణ రుణం’ స్కీమ్ కింద చిన్న కంపెనీల ( ఎంఎస్‌ఎంఈల) కు ఇచ్చే లోన్ పరిమితిని పెంచాలని స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ‘ఎంఎస్‌ఎంఈ సహాజ్– ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఇన్‌వాయిస్ ఫైనాన్షింగ్’ స్కీమ్ కింద రూ. 5 కోట్ల వరకు లోన్‌ను కంపెనీలు కేవలం 45 నిమిషాల్లోపు పొందొచ్చని బ్యాంక్ చెబుతోంది.
లోన్‌కు అప్లయ్ చేయడం, డాక్యుమెంట్ల ప్రాసెసింగ్, లోన్ డిస్‌బర్స్‌మెంట్ వంటివి ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ‘రూ. 5 కోట్ల వరకు లోన్‌ను ఇవ్వడానికి డేటా బేస్డ్ అసెస్‌మెంట్ విధానాన్ని కిందటేడాది ప్రవేశపెట్టాం.
ఎవరైనా మా ఎంఎస్‌ఎంఈ బ్రాంచ్‌కు వచ్చి తమ పాన్ కార్డ్, జీఎస్‌టీ డేటా సేకరించడానికి అనుమతి ఇస్తే 15 నుంచి 45 నిమిషాల్లో లోన్ అప్రూవల్స్ ఇస్తాం’ అని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అన్నారు. కొలేటరల్ లేకుండా సీజీటీఎంఎస్‌ఈ స్కీమ్ కింద మైక్రో, స్మాల్, మీడియం కంపెనీలకు లోన్ ఇవ్వడం మరింత సులభం చేయాలని చూస్తున్నామన్నారు.