బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ కెడర్ ఆఫీసర్(SCO) పోస్టుల భర్తీ కోసం జూలై 19న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 8లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఓబీసీ, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ వారికి ఫీజు లేదు. sbi.co.inలో అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ కచ్చితంగా ఉండాలి.
పోస్టుల వివరాలు ఇలా
రిలేషన్షిప్ మేనేజర్-(273)వీపీ వెల్త్(643), రిలేషన్షిప్ మేనేజర్టీమ్ లీడ్(32),ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (49), ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ (30) ,రీజినల్హెడ్(6), ఇంకా ఇతర ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచుల్లో పోస్టింగ్ ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
పోస్టును బట్టీ వయోపరిమితి, విద్యా అర్హతలు నోటిఫికేషన్ లో డీటెల్ గా ఇచ్చారు. పోస్టులు బట్టి డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎం లేదా సీఏ, సీఎఫ్ఏ చదివి ఉండాలి. NISM ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, రీసెర్చ్అనలిస్ట్ సర్టిఫికెట్, సీఎఫ్పీ, ఎన్ఐఎస్ఎం కోర్సులతోపాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఆధారంగా వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కర్షన్ ఉంటుంది. వాటిలో సెలక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.