ఈ ఏడాది కొత్తగా 400 ఎస్‌‌‌‌బీఐ బ్రాంచులు : దినేష్ ఖారా

ఈ ఏడాది కొత్తగా 400 ఎస్‌‌‌‌బీఐ బ్రాంచులు : దినేష్ ఖారా
  • ఆన్‌‌‌‌లైన్ ట్రాన్సాక్షన్లు పెరిగినా బ్రాంచులు అవసరమే

న్యూఢిల్లీ:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 400 కొత్త బ్రాంచులను ఓపెన్ చేస్తామని ఎస్‌‌‌‌బీఐ చైర్మన్  దినేష్ ఖారా ప్రకటించారు. దేశం మొత్తం మీద బ్యాంకింగ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను మరింతగా విస్తరిస్తామని అన్నారు. దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన ఎస్‌‌‌‌బీఐ, కిందటి ఆర్థిక సంవత్సరంలో 137 కొత్త బ్రాంచులను ఓపెన్ చేసింది. ఇందులో 59 బ్రాంచులు గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ చేసింది. ‘ 98 శాతం ట్రాన్సాక్షన్లు బ్రాంచులకు వెలుపలనే జరుగుతున్నాయి. కొత్త బ్రాంచులను ఓపెన్ చేయడం అవసరమా? అని కొంత మంది నన్ను అడిగారు. అవును అవసరమే.  

ఎందుకంటే కొత్త బిజినెస్‌‌‌‌లు అందుబాటులోకి వస్తున్నాయి’ అని దినేష్ ఖారా పేర్కొన్నారు. చాలా వరకు అడ్వైజరీ, వెల్త్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లు  బ్రాంచుల్లోనే ఆఫర్ చేయగలమని తెలిపారు. అవకాశాలు ఉండే లొకేషన్ల కోసం వెతుకుతున్నామని, ఈ ఏడాది 400 బ్రాంచులను ఓపెన్ చేస్తామని  దినేష్ ఖారా వివరించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశం మొత్తం మీద 22,542 బ్రాంచులను ఎస్‌‌‌‌బీఐ ఆపరేట్ చేస్తోంది.