స్టేట్‌ బ్యాంక్‌లో 10 వేల కొలువులు

స్టేట్‌ బ్యాంక్‌లో 10 వేల కొలువులు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 వేల మందిని నియమించుకోవాలని ఎస్‌‌‌‌బీఐ చూస్తోంది. జనరల్‌‌‌‌ బ్యాంకింగ్ రోల్స్‌‌‌‌, టెక్నికల్ రోల్స్‌‌‌‌  కోసం ఈ నియామకాలు చేపట్టనుంది. డిజిటల్ సర్వీస్‌‌‌‌లను మెరుగుపరిచేందుకు టెక్నాలజీపై ఎస్‌‌‌‌బీఐ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ‘జనరల్ బ్యాంకింగ్ సైడ్‌‌‌‌, టెక్నాలజీ సైడ్ ఉద్యోగులను పెంచుకుంటున్నాం. టెక్నికల్ రోల్స్‌‌‌‌ కోసం 1,500 మందిని నియమించుకుంటామని ఇప్పటికే ప్రకటించాం.

ఎంట్రీ లెవెల్‌‌‌‌, హయ్యర్ లెవెల్ రోల్స్‌‌‌‌ కోసం ఈ నియామకాలు చేపట్టనున్నాం’ అని ఎస్‌‌‌‌బీఐ చైర్మన్ సీఎస్‌‌‌‌ శెట్టి అన్నారు. డేటా సైంటిస్ట్‌‌‌‌, డేటా ఆర్కిటెక్ట్‌‌‌‌, నెట్‌‌‌‌వర్క్ ఆపరేటర్ వంటి టెక్నికల్ రోల్స్‌‌‌‌ కోసం కూడా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 వేల నుంచి 10 వేల మందిని నియమించుకుంటామని వివరించారు. కాగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎస్‌‌‌‌బీఐ ఉద్యోగుల సంఖ్య 2,32,296 కి పెరిగింది.