Jobs Alert: SBI బ్యాంకులో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Jobs Alert: SBI బ్యాంకులో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఎస్బీఐ బ్యాంకు 600 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరుసటి రోజు శుక్రవారం (27, డిసెంబర్, 2024) నుండి ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభమవుతుంది.  అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

ఆన్ లైన్ అప్లికేషన్, ఫీజు చెల్లింపు ప్రారంభం,  తేదీ: 27.-12.-2024
ఆన్ లైన్ అప్లికేషన్, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 16.-01.-2025
ప్రిలిమినరీ ఎక్జామ్ : 8th, 15th March 2025
ఆన్ లైన్ మెయిన్స్ ఎక్జామ్: April  లేదా May 2025

అప్లికేషన్ ఫీజుల వివరాలు:
For Unreserved / EWS/ OBC: Rs. 750/-
For SC/ ST/ PwBD: Nil

వయసు: 
21 నుంచి 30 లోపు
02.04.1994 నుండి 01.04.2003 

విద్యార్హత: ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.