
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ విద్యార్హతతో భద్రమైన బ్యాంక్ కొలువులో స్థిరపడేందుకు నిరుద్యోగులకు ఇదో మంచి అవకాశం. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మూడు దశల్లో నిర్వహించే ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం...
వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలనేది నిరుద్యోగుల కల. మంచి జీతం, తక్కువ సమయంలోనే ప్రమోషన్స్, ఆకర్షణీయమైన అలవెన్స్‌లు బ్యాంక్ ఎంప్లాయిస్‌కు ఉంటాయి. ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల కన్నా జీతం అధికంగా ఉంటుంది. ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం వార్షిక వేతనం రూ.8.20 లక్షల నుంచి రూ.13.08 లక్షల మధ్య ఉంటుంది.అందుకే ఎస్‌బీఐ విడుదల చేసిన 2000 పీవో పోస్టులకు దాదాపు 10 లక్షల మంది అప్లై చేస్తారని అంచనా. పోటీ ఎక్కువ ఉంటుంది కావునా ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్‌లో ఆబ్జెక్టివ్ తరహాలో ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్‌లో ఆబ్జెక్టివ్ టైప్ మెయిన్స్, డిస్క్రిప్టివ్ టెస్ట్, మూడో దశలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లేదా కేవలం ఇంటర్వ్యూ ఉంటాయి. మొదటి దశ నుంచి పోస్టుల సంఖ్య ఆధారంగా 10 రెట్ల మందిని రెండో దశకు ఎంపిక చేస్తారు. సెకండ్ స్టేజ్ నుంచి పోస్టుల సంఖ్యకు మూడు రెట్ల మంది మూడో దశకు ఎంపికచేస్తారు. అత్యుత్తమ మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులే తదుపరి దశలకు ఎంపికవుతారు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో అన్నీ సెక్షన్‌లలో కలిపి అగ్రిగేట్ మార్కులనే ప్రాతిపదికగా తీసుకుంటారు. సెక్షన్‌ల వారీగా కటాఫ్ మార్కులు లేకపోవడం అభ్యర్థులకు ఊరట కలిగించే అంశం.
b) డిస్క్రిప్టివ్ టైప్ ( 50 మార్కులు)
30 నిమిషాల్లో లెటర్, ఎస్సే రైటింగ్ కంప్యూటర్ లో టైప్ చేయాలి.
30 మార్కులు ఇంటర్వ్యూ, 20 మార్కులు గ్రూప్ డిస్కషన్ కు కేటాయిస్తారు.
కంబైన్డ్ ప్రిపరేషన్
ప్రిలిమ్స్, మెయిన్స్ లో కొన్ని మినహా చాలా వరకు సేమ్ టాపిక్స్ ఉన్నాయి. అందుకే మెయిన్స్
ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కూడా పూర్తయినట్లే.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ప్రిలిమ్స్‌లో ఉన్న ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్, అప్రాక్సిమేట్ వాల్యూస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పర్ముటేషన్- కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్, అర్థమెటిక్ టాపిక్స్ ఉంటాయి.
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్: ప్రిలిమ్స్, మెయిన్స్.. రెండిట్లోనూ రీజనింగ్ ఉంది. ఎస్‌బీఐ పీవో రీజనింగ్ ప్రశ్నలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా స్టేట్‌మెంట్ ప్రశ్నల్లో ఆప్షన్లు అన్నీ సరైనవిగా అనిపించేలా ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5- నుంచి 10 ప్రశ్నలు రావొచ్చు.
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్: మెయిన్స్‌లోని ఈ టాపిక్ కోసం అర్థమెటిక్ టాపిక్స్ బాగా ప్రిపేర్ కావాలి. టేబుల్స్, లైన్ గ్రాఫ్‌లు, బార్ డయాగ్రమ్‌లు, పై చార్టులు, కేస్‌లెట్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలగాలి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మార్కులు ఎక్కువ స్కోర్ చేయవచ్చు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్: ప్రిలిమ్స్, మెయిన్స్‌లతో పాటు డిస్క్రిప్టివ్ టెస్ట్‌లోనూ ఈ టాపిక్ ఉన్నందున దీనిపై అభ్యర్థులు ఎక్కువ ఫోకస్ చేయాలి. గ్రామర్‌పై ఎక్కువగా పట్టు పెంచుకోవాలి. ప్యాసేజీని వేగంగా చదివి, అర్థం చేసుకోగలిగితే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు త్వరగా సాధించవచ్చు. డిస్క్రిప్టివ్ టెస్ట్ కోసం లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్: కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ టర్మినాలజీ, స్టాండర్డ్ జీకేల నుంచి ప్రశ్నలు అడుగుతారు. బ్యాంకింగ్, ఆర్థిక సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. గత ఐదారు నెలల కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలి.
పీవోగా జాయినై.. చైర్మన్ గా రిటైర్
ఎస్‌బీఐలో పీవోగా సెలక్ట్ అయితే రెండు సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే అసిస్టెంట్ మేనేజర్‌గా నియమిస్తారు. అద్భుత ప్రతిభ కనబరిచిన వారు అంచెలంచెలుగా డిఫ్యూటీ మేనేజర్, మేనేజర్, చీఫ్ మేనేజర్, ఏజీఎం, డీజీఎం, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, డిఫ్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, చివరకు చైర్మన్ హోదా వరకూ చేరుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు విదేశాల్లోనూ బ్రాంచీలు ఉన్నందున టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఇతర దేశాల్లోనూ పనిచేసే అవకాశం ఉంటుంది.
ఇంగ్లీష్ ఇంపార్టెంట్
ఇంగ్లీష్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, మల్టిపుల్ మీనింగ్/ఎర్రర్ స్పాటింగ్,పేరాగ్రాఫ్ కంప్లిషన్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంపార్టెంట్. ఈ టాపిక్ లో 8 నుంచి 10 మార్కులు వచ్చే చాన్స్ ఉంది. క్లోజ్ టెస్ట్ 5 నుంచి 10, పారా జంబుల్స్ 3 నుంచి 5 మిగతా టాపిక్స్‌లో 1 నుంచి 3 వరకు మార్కులు వచ్చే వీలు ఉంది.
రీడింగ్ కాంప్రహెన్షన్: ప్యాసేజీని వేగంగా చదివి ఆన్సర్ గ్రహించగలిగితే కాంప్రహెన్షన్ ప్రశ్నలు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అభ్యర్థులు ముందుగా ప్యాసేజీ కింద ఇచ్చిన ప్రశ్నలను చదవాలి. ఆ తర్వాత ప్యాసేజీ చదివి వాటికి ఆన్సర్ చేస్తే ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ ఆన్సర్స్ దొరికే వీలున్నవి ముందు చేయాలి. న్యూస్‌పేపర్స్ ఎడిటోరియల్స్ నుంచి చిన్న చిన్న ప్యాసేజీలు రోజూ ప్రాక్టీస్ చేస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్కు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.
నోటిఫికేషన్
ఖాళీలు: మొత్తం 2000 పోస్టులు (ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్- 200, యూఆర్- 810) అందుబాటులో ఉన్నాయి.
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 27 వరకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. ప్రిలిమ్స్ నవంబర్‌లో, మెయిన్స్ డిసెంబర్ లేదా జనవరిలో, ఇంటర్వ్యూలు జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.sbi.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.
స్టడీ ప్లాన్: ప్రిపరేషన్ మొదలుపెట్టడానికి ముందు కొన్ని మాక్ టెస్టులు రాసి, ఏ టాపిక్‌లో స్ట్రాంగ్ ఉన్నారు. ఎక్కడ వీక్ ఉన్నారో తెలుసుకోవాలి. వీక్‌గా ఉన్న టాపిక్స్‌పైన స్పెషల్ ఫోకస్ చేయాలి.ప్రిపేర్ అవుతున్నప్పుడు నోట్స్ రాసుకోవాలి. రివిజన్ టైమ్‌లో ఈజీగా ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. దీంతో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, ప్రశ్నలు అడిగే సరళి తెలుస్తుంది. సరైన ప్లాన్‌తో ప్రిపేర్ అయితే బ్యాంక్ ఎగ్జామ్‌లో విజయం సాధించవచ్చు.