న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పవర్, రోడ్లు మొదలైన రంగాలలోని ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి 15 సంవత్సరాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల ద్వారా రూ. 10 వేల కోట్లు సేకరించింది. బాండ్ల కూపన్ రేటును 7.36 శాతంగా నిర్ణయించింది. ఇష్యూ బేస్ ఇష్యూ పరిమాణం రూ.ఐదు వేల కోట్ల కంటే దాదాపు నాలుగు రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్అయింది.
ఇది గత సెప్టెంబర్లో 7.49 శాతం కూపన్‌లో 15 సంవత్సరాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లతో రూ. 10 వేల కోట్లను సమీకరించింది. వీటికి కూపన్రేటును 7.36 శాతంగా నిర్ణయించింది. ఈ బాండ్లకు ‘ఏఏఏ’ రేటింగ్ ఉంది. ప్రస్తుత జారీతో, బ్యాంక్ జారీ చేసిన మొత్తం దీర్ఘకాల బాండ్ల మొత్తం విలువ రూ. 49,718 కోట్లకు చేరింది. ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, కార్పొరేట్లు వీటిలో ఇన్వెస్ట్ చేశారు.