జీడీపీ వృద్ధి 7.1 శాతానికి తగ్గుతుందన్న ఎస్​బీఐ

జీడీపీ వృద్ధి 7.1 శాతానికి తగ్గుతుందన్న ఎస్​బీఐ

ముంబై:  జూన్​ క్వార్టర్​లో మనదేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7.1 శాతానికి తగ్గుతుందని ఎస్‌‌‌‌బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేశారు.  గతంలోనూ కొందరు ఎకనమిస్టులు ఇలాంటి అంచనాలను ప్రకటించారు.   గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌‌‌‌–జూన్‌‌‌‌ కాలానికి స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి 6.7–6.8 శాతానికి తగ్గుతుందని తెలిపారు.  మొదటి​ క్వార్టర్​లో వృద్ధి 7.0–-7.1 శాతంగా  ఉండొచ్చని ఆర్థికవేత్తలు తెలిపారు.   గత ఏడాది జూన్ క్వార్టర్​లో,  అంతకుముందు మార్చి క్వార్టర్​లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంది. జూన్ క్వార్టర్​లో ఆర్థిక కార్యకలాపాల్లో కొంత తగ్గుదల ఉండొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. 

   బ్యాంకింగ్, ఫైనాన్స్,  ఇన్సూరెన్స్ కంపెనీలను మినహాయిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో కార్పొరేట్లు కేవలం 5 శాతం ఆదాయ వృద్ధిని సాధించారని ఎస్​బీఐ పేర్కొంది.  నిర్వహణ లాభాలు తగ్గాయని తెలిపింది.   అయితే, ఎస్​బీఐ ఆర్థికవేత్తలు 2024-–25 ఆర్థిక సంవత్సరానికి తమ 7.5 శాతం వృద్ధి అంచనాను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్​​బీఐ అంచనా 7.2 శాతం కంటే ఇది ఎక్కువ.