ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంక్‌‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) 606 స్పెషలిస్ట్ కేడర్​ ఆఫీసర్​ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు అక్టోబర్​ 18 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీలు : 606
పోస్టులు: రిలేషన్‌‌షిప్‌‌ మేనేజర్‌‌ - 334, కస్టమర్‌‌ రిలేషన్‌‌షిప్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ - 217,  ఇన్వెస్ట్​మెంట్ ఆఫీసర్‌‌ - 12, సెంట్రల్‌‌ రీసెర్చ్‌‌ టీమ్‌‌ (ప్రొడక్ట్‌‌ లీడ్‌‌, సపోర్ట్‌‌) - 4,  ఎగ్జిక్యూటివ్‌‌ (డాక్యుమెంట్‌‌ ప్రిజర్వేషన్‌‌) - 1, మేనేజర్‌‌ (మార్కెటింగ్‌‌) - 12, డిప్యూటీ మేనేజర్‌‌ (మార్కెటింగ్‌‌) - 26
విద్యార్హతలు: పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్‌‌, పీజీ, ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.  సంబంధిత పోస్టులో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 20 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
సెలెక్షన్​ ప్రాసెస్​: పోస్టులను బట్టి షార్ట్‌‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ, ఆన్‌‌లైన్‌‌ టెస్ట్‌‌, ఇంటరాక్షన్‌‌ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.
ఎగ్జామ్​ ప్యాటర్న్​​: ఆబ్జెక్టివ్​ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. రెండు గంటల్లో పూర్తి చేయాలి. ఇంగ్లిష్​ నాలెడ్జ్​  డిస్క్రిప్టివ్​ ఎగ్జామ్​లో 50 మార్కులకు లెటర్​ రైటింగ్​ అండ్​ ఎస్సేల మీద రెండు ప్రశ్నలు ఇస్తారు. 
దరఖాస్తులు: ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. 
చివరి తేదీ: 18 అక్టోబర్
వెబ్‌‌సైట్‌‌: www.sbi.co.in