Good News: లోన్లపై వడ్డీ రేట్లలను భారీగా తగ్గించిన ఎస్బీఐ.. EMIలు తగ్గుతాయి.. వారికి పండగే..

Good News: లోన్లపై వడ్డీ రేట్లలను భారీగా తగ్గించిన ఎస్బీఐ.. EMIలు తగ్గుతాయి..  వారికి పండగే..

ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ లకు అద్దిరిపోయే న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ తో పాటు ఇతర లోన్లపై ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచి (ఫిబ్రవరి 15) అమలులోకి వస్తాయి. దీంతో లోన్లపై ఉన్న ఈఎమ్ఐలు, వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించడంతో.. వివిధ లోన్లపై ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తామని ఇటీవలే ఎస్బీఐ ప్రకటించిన సంగత తెలిసిందే. అందులో భాగంగా ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ బేస్ డ్ లెండింగ్ రేట్స్ (EBLR), రెపో లింక్ డ్ లెండింగ్ రేట్స్ (RLLR)లను హోమ్ లోన్స్ (గృహ రుణాలు)తో పాటు ఇతర లోన్లపై కూడా తగ్గించింది. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ కట్స్ ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే.  మానెటరీ పాలసీలో భాగంగా 6.50% నుంచి 6.25% తగ్గించింది ఆర్ బీఐ. దీంతో ఎస్బీఐ కూడా రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కస్టమర్స్ కు భారీ ఎత్తున ఇంట్రెస్ట్ రేట్లు సేవ్ కానున్నాయి.

వివిధ బ్యాంకులలో వడ్డీ రేట్లు ఎంత వరకు తగ్గాయి:

కెనరా బ్యాంకు ఫిబ్రవరి 12 నుంచి వడ్డీ రేట్లు 9.25 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిబ్రవరి 10 నుంచి వడ్డీరేట్లను 8.90 శాతానికి తగ్గించింది. 

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 7  నుంచి వడ్డీ రేట్లు 9.35 నుంచి 9.10 శాతానికి తగ్గించింది. 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 11 నుంచి 9.25 నంచి 9 శాతానికి తగ్గించింది. 

పంజాబ్ నేషనల్ బ్యాంకు  ఫిబ్రవరి 10 నుంచి వడ్డీ రేట్లు 9.25 నంచి 9 శాతానికి తగ్గించింది.