Bank Jobs: ఎస్‌బీఐ ఉద్యోగాల గడువు సమీపిస్తోంది.. త్వరగా దరఖాస్తు చేసుకోండి

Bank Jobs: ఎస్‌బీఐ ఉద్యోగాల గడువు సమీపిస్తోంది.. త్వరగా దరఖాస్తు చేసుకోండి

దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 169 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఇంజనీర్- (సివిల్, ఎలక్ట్రికల్, ఫైర్) విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులుఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 160

విభాగాల వారీగా ఖాళీలు:

  • అసిస్టెంట్ మేనేజర్ (సివిల్): 42
  • అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 25
  • అసిస్టెంట్ మేనేజర్ (ఫైర్): 101

అర్హతలు: 

అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్- సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టులకు అభ్యర్థులు సంబంధిత డిగ్రీ (సివిల్/ ఎలక్ట్రికల్) కలిగి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్-ఫైర్) పోస్టులకు అభ్యర్థులు BE (ఫైర్) లేదా BE/B Tech (సేఫ్టీ & ఫైర్ ఇంజినీరింగ్, ఫైర్ టెక్నాలజీ & సేఫ్టీ ఇంజనీరింగ్, ఫైర్ సేఫ్టీ సంబంధిత విభాగాల్లో సమానమైన 4 సంవత్సరాల డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 

01/ 10/ 2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్- సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టులకు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.  అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్-ఫైర్) పోస్టులకు21 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వడ్ క్యాటగిరి అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము:

జనరల్/ OBC/EWS అభ్యర్థులు రూ.750/- దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST/PwD అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ALSO READ : JOB NEWS : మాజ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లో నాన్ ఎగ్జిక్యూటివ్స్

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభ తేది: 22/ 11/ 2024
  • దరఖాస్తులకు చివరి తేది: 12/ 12/ 2024

నోటిఫికేషన్ కోసం ఇక్కడ SBI SO Recruitment 2024 క్లిక్ చేయండి.